News July 7, 2025

అన్నా క్యాంటీన్‌లో ఆహారం నాణ్యంగా ఉండాలి: కలెక్టర్

image

రామచంద్రపురంలోని అన్నా క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.

Similar News

News July 7, 2025

బాపట్ల పీజీఆర్ఎస్‌లో 55 అర్జీల: ఎస్పీ

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ తుషార్ డూడి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 55 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని సూచించారు.

News July 7, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పామర్రులో దొంగల ముఠాను అరెస్ట్
☞కృష్ణా: అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ
☞ మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు
☞ ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌ను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
☞నూజివీడు: IIITలో 141 సీట్లు ఖాళీ
☞ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన

News July 7, 2025

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఉత్పత్తుల ధరలు

image

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పలు ఉత్పత్తుల ధరలు కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2459. కనిష్ఠం: 2129, ✓ మక్కలు: గరిష్ఠం: 2200. కనిష్ఠం: 2200, ✓ పత్తి: గరిష్ఠం:7421. కనిష్ఠం: 3899, ✓ పసుపు(కాడి): గరిష్ఠం: 10,852. కనిష్ఠం: 3809, ✓ పసుపు(గోల): గరిష్ఠం: 10,559. కనిష్ఠం: 5298.