News December 23, 2024
అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మెదక్ లో సర్వ శిక్షా ఉద్యోగుల నిరసనకు హరీష్ రావు మద్దతు పలికి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో నిలదీసినా స్పందించలేదని పండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ప్రజల సమస్యలు ముఖ్యం కావా అని ప్రశ్నించారు. ఇకనైనా సమగ్ర ఉద్యోగుల సమస్య పరిష్కరించాలన్నారు.
Similar News
News November 6, 2025
డిసెంబర్ 3 నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

మెదక్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థుల కోసం (6 నుండి 12వ తరగతి) జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు డీఈవో రాధాకిషన్ తెలిపారు. ఈ ప్రదర్శనలు డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో జరుగుతాయి. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈవో సూచించారు.
News November 6, 2025
కౌడిపల్లి: కోళ్ల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన కొన్యాల దత్తయ్య(57) నడిచి వెళ్తుండగా.. రాంగ్రూట్లో వచ్చిన కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే దత్తయ్యను అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 6, 2025
‘మెదక్ జిల్లాలో బాల్య వివాహాలు జరగవద్దు’

మెదక్ జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా చూడాలని, అలాగే డ్రగ్స్ నిర్మూలన, ఫోక్సో చట్టంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలని, బాల కార్మికులు లేకుండా చూడాలని, బాలల హక్కులను రక్షించాలని సూచించారు. డ్రగ్స్ నిరోధం, ఫోక్సో చట్టాలపై ప్రచారం పెంచాలని దిశానిర్దేశం చేశారు.


