News March 21, 2025
అన్ని వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు చదువుకొనే అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని వసతి గృహాల వార్డెన్లతో జూమ్ సమావేశం నిర్వహించారు. అన్ని వసతి గృహాలకు ఇప్పటికే మంజూరు చేసిన నిధులతో రిపేర్ పనులు పూర్తి చేశామన్నారు.
Similar News
News March 22, 2025
చిత్తూరు: ఒకరి ప్రాణం కాపాడిన SI

చిత్తూరు జిల్లాలో ఓ ఎస్ఐ ఒకరి ప్రాణం కాపాడారు. యాదమరి మండలం జోడిచింతలకు చెందిన ఓ వ్యక్తి లోన్ తీసివ్వాలని తల్లిని కోరాడు. కొన్ని రోజుల తర్వాత తీసిస్తానని ఆమె చెప్పింది. ‘నేనంటే నీకు ఇష్టం లేదు. నేను చనిపోతున్నా అమ్మ’ అంటూ అతను తల్లికి వీడియో పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఈశ్వర్ యాదవ్ టెక్నాలజీ ఉపయోగించారు. మందు తాగి పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలు కాపాడారు.
News March 22, 2025
బ్యాంకుల సమ్మె వాయిదా

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలో తగినన్ని నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA), కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
News March 22, 2025
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నిధుల విడుదల

AP: ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి రూ.600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరో రూ.400కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకూ ఈ పథకానికి మెుత్తంగా రూ.788కోట్లు విడుదలయినట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే మాత్రం కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.