News November 4, 2025
అన్నీ పండించే కాపునకు అన్నమే కరవు

రైతులు తమ శ్రమతో దేశం మొత్తానికి కావాల్సిన పంటలు పండించి ఆహారాన్ని అందిస్తారు. కానీ కొన్నిసార్లు వారి సొంత కష్టాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుకే సరైన తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల ఆకలి తీర్చే అన్నదాతలు తమ ప్రాథమిక అవసరాలకే కష్టపడటాన్ని ఈ సామెత తెలియజేస్తుంది. రైతు కష్టానికి తగిన గుర్తింపు, మద్దతు లభించడం లేదనే విషయాన్ని ఇది సూచిస్తుంది.
Similar News
News November 4, 2025
APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) 6 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc( అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్), పీజీ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ) అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News November 4, 2025
డ్రైవరన్నా.. వేగం తగ్గించు!

TG: ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం వేగంగా వెళ్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అంటున్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిందని, ఒత్తిడికి గురవుతున్నామని డ్రైవర్లు, కండక్టర్లు వాపోతున్నారు. ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.
News November 4, 2025
వరి కోతలు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది

వరి వెన్నులో 80-90% గింజలు పసుపు రంగులోకి మారుతున్నప్పుడు పంటను కోయాలి. ఈ దశలో గింజల్లో తేమ 18-24% వరకు ఉంటుంది. గింజలు పూర్తిగా ఎండే వరకు ఉంచకూడదు. పంట పక్వానికి వచ్చాక ఎక్కువ కాలం చేను మీద ఉంటే దిగుబడి తగ్గి, గింజలపై పగుళ్లు ఏర్పడి ధాన్యాన్ని మర పట్టించినప్పుడు నూక శాతం పెరుగుతుంది. గింజలలో తేమ శాతం తగ్గించడానికి పనలను 4 నుంచి 5 రోజులు చేనుపై ఎండనివ్వాలి. పనలను తిరగతిప్పితే సమానంగా ఎండుతాయి.


