News June 5, 2024

అన్న ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్యే

image

ఒకే ఇంటి నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులుగా విజయం సాధించారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి చిన్న కుమారుడు అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందగా, పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా 5,59,906 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు.

Similar News

News March 2, 2026

మార్చి 31లోగా లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా LRS దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మార్చి 31 లోగా నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 2, 2026

హోలీ రోజు డ్రంకెన్ డ్రైవ్ తనీఖీలు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

హోలీ పండుగ రోజు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’ నిరంతరం పహారా కాస్తాయని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇతరులకు హాని కలగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.

News March 2, 2026

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

నల్గొండ మండలం చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో నకిరేకల్ నుంచి నల్గొండకు వస్తున్న బైక్, ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.