News March 23, 2025
అన్న కోసం ఎదురు చూసి అనంతలోకాలకు

అన్న కోసం ఎదురు చూసిన చిన్నారి అనంతలోకాలకు వెళ్లిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. నగరి మండలం వీకేఆర్ పురం గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగనన్న కాలనీలో ఉంటున్న నోమేశ్వరి(10) మృతి చెందగా, ఆమె సోదరుడు మహేశ్ గాయపడిన విషయం తెలిసిందే. ఒంటిపూట బడి కావడంతో అన్న కోసం ఎదురు చూసిన నోమేశ్వరి.. మహేశ్ రాగానే ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వారిని కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
Similar News
News March 25, 2025
ఈసారైనా రామకుప్పం ఎంపీపీ ఎన్నిక జరిగేనా?

రామకుప్పం మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఎంపీపీ ఎన్నిక 5 సార్లు వాయిదా పడింది. మొత్తం 15 మంది MPTCలకు గాను వైసీపీకి చెందిన సుమారు 7 మంది ఎంపీటీసీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా ఈ ఎన్నికను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. వైస్ ఎంపీపీ పదవికి ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ఈసారైనా ఎన్నిక జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.
News March 25, 2025
నాగలాపురం: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

ఉ.చిత్తూరు(D) నాగలాపురం(M)లోని ఓ కాలనీలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో చరణ్(23)పై కేసు నమోదు చేసినట్లు SI సునీల్ కుమార్ తెలిపారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
News March 25, 2025
చిత్తూరు: మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ

మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఇందుకోసం మార్చి 10 నుంచి దరఖాస్తులను బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.