News February 4, 2026
అన్‌బ్రాండెడ్ పొగాకు ఉత్పత్తులపై జీరో ట్యాక్స్.. ఏపీ మద్దతు

AP: ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గించడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. ఈ మేరకు FEB 1 నుంచే దీన్ని అమలుచేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజిట్‌కు మద్దతిచ్చారు. ఇది రాష్ట్రంలో అన్ బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఈ నోటిఫికేషన్‌ను దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 21, 2026
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 21, 2026
అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.
News February 21, 2026
మహిళలకు నెలకు రూ.25,000.. క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్‌ను తీసుకొచ్చిందంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు జీతం వస్తుందనేది అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను చూసి మోసపోవద్దని పౌరులకు సూచించింది. ఫేక్ న్యూస్, వీడియో, ఫొటో కనిపిస్తే factcheck@pib.gov.inకు పంపాలని కోరింది.


