News September 12, 2025
అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ పోలీసులు

అపరిచితులతో ఫోన్ కాల్స్, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అపరిచితులతో న్యూడ్ వీడియో కాల్స్‌లో పాల్గొనవద్దని, అలా ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యాశతో మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని హెచ్చరించారు.
Similar News
News September 12, 2025
రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం: మంత్రి సత్యకుమార్

AP: యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని 1.43 కోట్ల BPL కుటుంబాలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. APL (Above poverty line) ఫ్యామిలీలకు రూ.2.50 లక్షల వరకు ఫ్రీ వైద్యం అందుతుందన్నారు. ఈ విధానంలో ప్రభుత్వం ముందే ప్రీమియం చెల్లిస్తుందని, నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్యసేవలను నిలిపివేసే అవకాశం ఉండదని Way2News కాన్‌క్లేవ్‌లో వివరించారు.
News September 12, 2025
రాష్ట్రంలో ఎరువులకు కొరతలేదు: మంత్రి

రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ, కలెక్టర్లు, వ్యవసాయ శాఖాధికారులతో ప్రతిరోజూ సమీక్షలు జరుపుతున్నామన్నారు.
News September 12, 2025
వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి

అనంతపురం జిల్లా వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరోవైపు భాస్కర్ రెడ్డి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.