News December 11, 2024

అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దు: ఎస్పీ

image

అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్​ లిఫ్ట్ చేస్తే వారు మీ కాల్‌ను రికార్డు చేసి పోలీసు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తారన్నారు. వేధింపులకు గురిచేసి మీ డబ్బులు దోచేస్తారని, అటువంటి సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని ప్రజలను సూచించారు. సైబర్ నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 26, 2024

శ్రీశైలానికి మంత్రి కొండా సురేఖ రాక

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి నేడు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నట్లు దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. రాత్రి 7 గంటలకు మంత్రి శ్రీశైలం చేరుకుంటారని చెప్పారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

News December 26, 2024

శిరివెళ్ళ: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

image

శిరివెళ్ళ మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ పట్టణంలోని పద్మనాభ రావువీధికి చెందిన కళ్యాణ్(25) అనే ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. నంద్యాలలోని ఏవిఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అతడు బైక్‌పై కాలేజీకి వెళ్తుండగా కడప నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణకు చెందిన కారు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 26, 2024

శ్రీశైలంలో 112.7 TMCల నీరు నిల్వ

image

శ్రీశైల డ్యాం బ్యాక్ వాటర్ ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో 6,366 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తెలంగాణ పరిధిలోని విద్యుత్ కేంద్రానికి 241, హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,590, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాంలో 862.20 అడుగుల్లో 112.7164 టీఎంసీల నీరు నిల్వ ఉంది.