News April 11, 2025

అపార్ట్ కార్డుల నమోదులో మొదటి స్థానంలో జగిత్యాల

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే అపార్ కార్డుల నమోదులో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 1096 పాఠశాలలు ఉండగా.. 1,61,822 మంది విద్యార్థులు ఉన్నారు. అపార్ కార్డుల నమోదులో 88.73 శాతం చేసి రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచేందుకు కృషిచేసిన జిల్లా విద్యాధికారి రామును ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ప్రత్యేకంగా అభినందించారు.

Similar News

News February 15, 2026

నాటి మణిగిరి.. నేటి మెట్టుగుట్ట

image

శివకేశవుల మధ్య భేదం లేదని చాటే అద్వైతమతానికి ప్రత్యక్ష నిలయం మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం. కాజీపేట రైల్వే స్టేషన్‌కు 2 కి.మీ దూరంలో మడికొండ గ్రామ సమీపంలోని గుట్టపైన ఈ ఆలయం ఉంది. మెట్టుగుట్టగా ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రాన్ని కాకతీయ రాజులు నిర్మించారు. మొదట చాళుక్య రాజులు వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

News February 15, 2026

ప్రమాణస్వీకారానికి రండి.. మోదీకి బంగ్లా ఆహ్వానం!

image

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఈ నెల 17న కొలువుదీరనుంది. ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. మరో 12 దేశాలకు ఇన్విటేషన్ పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అతికొద్ది మందిని క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారని, తర్వాత విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎన్నికల్లో 297 స్థానాలకు గాను 209 చోట్ల BNP గెలిచింది.

News February 15, 2026

శివ నామాలు అర్థాలు ‘‘దక్షిణామూర్తి’’

image

శివుడు కేవలం లయకారుడే కాదు, సకల విద్యాప్రదాత కూడా. మౌనంగా ఉంటూనే తన ముద్రల ద్వారా పరమ సత్యాన్ని బోధించే ఆదిగురువు ఈయన. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని సనకాది మునులకు జ్ఞానాన్ని ఉపదేశించారు కాబట్టి ఈయనకు ‘దక్షిణామూర్తి’ అనే పేరు వచ్చింది. మేధస్సు, జ్ఞానం, సంగీతం, యోగం వంటి కళలన్నింటికీ ఈయనే మూలపురుషుడు. విద్యార్థులు, జ్ఞానాన్వేషకులు ఈయనను ధ్యానించడం వల్ల అత్యున్నతమైన బుద్ధిని పొందుతారు.