News October 9, 2025

అపోలో వర్సిటీ ఘటనపై కేసు నమోదు

image

చిత్తూరు అపోలో యూనివర్సిటీలోని <<17959171>>గర్ల్స్ టాయిలెట్‌లో<<>> హిడెన్ కెమెరా అమర్చిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజినీరింగ్ పనిచేస్తున్న రూబెన్‌గా నిర్ధారించారు. ఈ మేరకు అతని నుంచి పోలీసులు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 10, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.20 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు
✒ ఇష: రాత్రి 7.10 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 10, 2025

CM పర్యటనకు 1250 మందితో బందోబస్త్: SP

image

1,250 మంది పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు ఎస్పీ అజిత తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. అధికారులకు బ్రీఫింగ్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ సమస్య లేకుండా, పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

News October 10, 2025

తిరుపతి: PG ఫలితాలు వచ్చేశాయ్.!

image

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది డిసెంబర్‌లో (పీజీ) PG M.A హిస్టరీ, M.Sc బాటని/బయో కెమిస్ట్రీ/ జియాలజీ/ జువాలజీ/ బయోటెక్నాలజీ/ అంత్రపాలజీ మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.