News August 30, 2025

అప్పట్లో రౌడీలను పరిగెత్తించి కొట్టా: కోటంరెడ్డి

image

నెల్లూరు VR కాలేజీలో విద్యార్థులను రౌడీలు బెదిరిస్తే.. అప్పట్లో తాను పరిగెత్తించి కొట్టానని రూరల్ MLA కోటంరెడ్డి అన్నారు. ‘జీవితంలో తప్పు చేయను. ఎవరికీ భయపడను. ఈ గూండాలు, రౌడీల బెదిరింపులకు ఏడేళ్ల వయసున్న నా మనవడు, మనవరాళ్లు కూడా భయపడరు. నన్ను చంపితే డబ్బులు ఇస్తామని ఎవరు చెప్పారో పోలీసులే తేల్చాలి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వైసీపీ సోషల్ మీడియా ప్రవర్తిస్తోంది’ అని ఆయన అన్నారు.

Similar News

News August 31, 2025

ఏడాదిలోనే హామీలు అమలు: మంత్రి నారాయణ

image

అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మంత్రి నారాయణ అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ నెల్లూరు నగరంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చీ రాగానే పెన్షన్ల పెంపు ద్వారా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని, ప్రతి పిల్లవాడికి రూ.15 వేల చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.

News August 30, 2025

నెల్లూరు: లాటరీ పద్ధతి ద్వారా బార్ల కేటాయింపు

image

నెల్లూరు జిల్లాలోని ఓపెన్ కేటగిరీకి సంబంధించి 50 బార్లకు, గీత కులాలకు సంబంధించి ఐదు బార్లకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 21 బార్లకు సంబంధించి 94 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా బార్లను కేటాయించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది.

News August 30, 2025

నెల్లూరు జిల్లా గిరిజనులకు గమనిక

image

నెల్లూరు జిల్లాలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచనల మేరకు గిరిజనుల కోసం ప్రత్యేకంగా డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 6న కందుకూరు సబ్‌ కలెక్టర్ కార్యాలయం, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామన్నారు.