News December 17, 2025

అప్పయ్యపల్లి సర్పంచ్‌గా సుప్రియ

image

HNK జిల్లా శాయంపేట మండలం అప్పయ్యపల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుప్రియ వినయ్ కుమార్ ఘన విజయం సాధించారు. అప్పయ్యపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సర్పంచ్‌గా సుప్రియ ఎన్నికవడంతో వారి మద్దతుదారులు సంబరాలు జరుపుకొన్నారు.

Similar News

News December 17, 2025

మంత్రి జూపాల్లి స్వగ్రామ లో గెలిచింది ఇతనే..!

image

కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దదగడ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఉడుతల భాస్కర్ విజయం సాధించారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ మద్దతుదారు నిరంజన్ రెడ్డిపై 336 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రామ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

News December 17, 2025

వచ్చే ఏడాదిలో అందుబాటులోకి మూడో డిస్కం

image

TG: రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కం అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీని కిందికి 29,05,779 వ్యవసాయం, 489 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, 1132 మిషన్ భగీరథ, 639 మున్సిపల్ వాటర్ కనెక్షన్లు వెళ్లనున్నాయి. జెన్‌కోకు చెల్లించాల్సిన రూ.26,950 కోట్లు, రూ.9,032 కోట్ల ప్రతిపాదిత రుణాలు, రూ.35,982 కోట్ల బకాయిలు ఈ డిస్కంకు మళ్లించబడతాయి. దీనికి 2వేల మంది ఉద్యోగులను కేటాయించనుంది.

News December 17, 2025

చౌటుప్పల్: ఒక్క ఓటుతో ఆమె గెలిచింది..!

image

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థి టేకుల మంజుల, కాంగ్రెస్ అభ్యర్థి అర్థ పల్లవిపై కేవలం 1 ఓటుతో విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే గ్రామంలో బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.