News December 22, 2025
అప్పుడు ‘కిసాన్’.. ఇప్పుడు ‘జవాన్’

తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో అద్భుతం చోటుచేసుకుంది. 2023 సీజన్-7లో ‘జై కిసాన్’ అంటూ ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘జవాన్’ కళ్యాణ్ పడాల ‘బిగ్ బాస్-9’ <<18635005>>టైటిల్<<>>ను గెలిచారు. తొలి రోజు నుంచే కళ్యాణ్ తన నిజాయతీతో కూడిన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన వీరు బిగ్‌బాస్ విన్నర్లుగా నిలవడంపై హర్షం వ్యక్తం అవుతోంది.
Similar News
News December 22, 2025
2024 నుంచే అమరావతికి చట్టబద్ధత: పెమ్మసాని

AP: రాష్ట్ర రాజధానిని భవిష్యత్‌లో ఎవరూ తరలించడానికి వీల్లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం ఒప్పుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2024 నుంచే చట్టబద్ధతను అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడించారు. దీనిపై అటార్నీ జనరల్‌తోనూ చర్చించినట్లు వివరించారు. త్వరలోనే రాజధానికి పిన్ కోడ్, STD, ISD కోడ్‌లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు.
News December 22, 2025
హిందువులారా మేల్కోండి.. కాజల్ పోస్ట్

బంగ్లాదేశ్‌లో హిందువులను కాపాడాలంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హిందువులారా మేల్కోండి. మౌనం మిమ్మల్ని రక్షించదు’ అని పేర్కొన్నారు. దీపూ చంద్రదాస్ అనే హిందువును దారుణంగా చంపి చెట్టుకు కట్టి తగలబెట్టిన ఎడిటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘ALL EYES ON BANGLADESH HINDUS’ అని క్యాప్షన్ పెట్టారు.
News December 22, 2025
నెల రోజుల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

TG: కోడిగుడ్ల <<18636145>>ధరలతో<<>> పాటు చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కార్తీక మాసం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే చికెన్ సెంటర్ల నిర్వాహకులు పలు చోట్ల ఏకంగా రూ.100 పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నెల కిందటి వరకు రూ.210-220 ఉండగా ఇప్పుడు రూ.300కు చేరింది. న్యూఇయర్ వరకు రూ.330కి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నారు.


