News March 22, 2024
అప్పుడు గల్లా.. ఇప్పుడు పెమ్మసాని

టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఖరారైంది. 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ అనూహ్యంగా రాజకీయాలకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషించింది. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలతో పేరు పొందిన పెమ్మసాని తెరపైకి వచ్చారు. దీంతో ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పోటీ చేయనున్నారు.
Similar News
News February 26, 2026
జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు: GNT కలెక్టర్

గుంటూరు జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.
News February 26, 2026
సమర్థవంతంగా మ్యూటేషన్ చేయాలి: కలెక్టర్

తప్పులు లేని మ్యుటేషన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారుల సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యుటేషన్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి చేయాలన్నారు. మ్యుటేషన్ అనే అంశం రెవెన్యూ శాఖకు ప్రాథమిక విధి అన్నారు. ఎటువంటి తప్పులు దొర్లినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.
News February 26, 2026
డోలిమోతల నడుమ ప్రసవించడం బాధాకరం: రాయపాటి శైలజ

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి చెందిన సుమిత్ర డోలిమోతల నడుమ టార్చి లైట్ వెలుగుల్లో ప్రసవించడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన గర్భిణీలను ప్రసవానికి 15 రోజుల ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చి వైద్యుల పర్యవేక్షణలో సుఖ ప్రసవా జరిగే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.


