News January 22, 2026

అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?: కిషన్ రెడ్డి

image

TG: గతంలో BRS, ఇప్పుడు INC పాలనలో సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘నైనీ కోల్ బ్లాక్‌ టెండర్లపై కొందరు CBI దర్యాప్తు కోరుతున్నారు. కానీ రాష్ట్ర అంశాలను CBI దర్యాప్తు చేయకూడదని గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. అప్పుడు CBI ఎందుకు గుర్తుకు రాలేదు?’ అని ప్రశ్నించారు. కోల్ బ్లాక్స్‌ వేలం నిర్వహణకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Similar News

News February 22, 2026

తప్పిన వర్షం ముప్పు.. టాస్ గెలిచిన శ్రీలంక

image

T20WC: సూపర్-8 రెండో మ్యాచ్ పల్లెకెలెలో శ్రీలంక-ఇంగ్లండ్ మధ్య జరగనుంది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. నిన్నటి నుంచి అక్కడ వర్షం పడుతుండటంతో పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ మాదిరే రద్దు అవుతుందని అంతా భావించారు. కాగా సూర్యుడి రాకతో వాతావరణ పరిస్థితులు మెరుగుపడి మ్యాచ్ నిర్వహణకు వీలు పడింది.

News February 22, 2026

సునీల్ కుమార్ సస్పెన్షన్ మరోసారి పొడిగింపు

image

AP: CID మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. క్రిమినల్ కేసు పూర్తవడం లేదా రిటైర్మెంట్‌లో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలున్నాయి.

News February 22, 2026

కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

image

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.