News April 19, 2024

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

image

ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నేతేట్ల మల్లయ్య(48) అనే వ్యక్తి కుటుంబ పోషణకై అప్పులు చేశాడు. అప్పుల భారం పెరగడంతో గురువారం రాత్రి 10:30 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి నారాయణపూర్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

Similar News

News February 18, 2026

KNR: ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ పమేలా సత్పత్తి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆమె పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాం వద్ద విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

News February 18, 2026

కరీంనగర్: ‘విష’ ప్రయోగం.. 50 కోళ్లు మృత్యువాత!

image

కరీంనగర్ జిల్లా ఊటూర్‌లో మానవత్వం మంటగలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు కోళ్ల దాణాలో విషం కలపడంతో 50 నాటుకోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. స్వయం ఉపాధి కోసం వీటిని పెంచుతున్న నిరుద్యోగి జలంధర్ రెడ్డికి సుమారు ₹70వేల నష్టం వాటిల్లింది. పశువైద్యులు విషప్రయోగాన్ని ధృవీకరించగా, బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నోరులేని జీవాలను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News February 18, 2026

కరీంనగర్: సర్వేయర్లకు లైసెన్సులు అందజేసిన కలెక్టర్

image

భూభారతి చట్టం-2025లో భాగంగా శిక్షణ పొందిన సర్వేయర్లకు కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం లైసెన్సులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి ఎంపికైన 274 మందిలో ఇప్పటికే 136 మందికి సీఎం చేతుల మీదుగా పత్రాలు అందగా, మిగిలిన వారిలో 41 మందికి నేడు కలెక్టర్ లైసెన్సులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 5000 మందికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఈ నియామక పత్రాలను అందజేస్తోంది.