News December 23, 2025

అప్పు చేసి మరీ ఎంజాయ్ చేస్తున్న మన కుర్రకారు.. మరి చైనాలో?

image

భారత యువత అవసరం కోసమో, ఆస్తుల కోసమో కాకుండా.. ఎంజాయ్ చేయడానికే అప్పులు చేస్తున్నారట. ఈ ఏడాదిలో మన కుర్రకారు తీసుకున్న పర్సనల్ లోన్లలో 27% టూర్ల కోసమేనని తేలినట్లు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా తెలిపారు. మరోవైపు చైనా యువత మాత్రం బంగారం కొంటూ భవిష్యత్తు కోసం జాగ్రత్త పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనవాళ్లేమో రేపటి సంపాదనపై ధీమాతో నేడు అప్పు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు.

Similar News

News January 2, 2026

AMPRIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో 13 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 4 ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ(సైన్స్, CS), టెన్త్, ఐటీఐ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.66,500, టెక్నీషియన్‌కు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in

News January 2, 2026

సిద్ధమవుతున్న బరులు.. సన్నద్ధమవుతున్న పుంజులు

image

సంక్రాంతికి కోడి పందేల కోసం గోదావరి జిల్లాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. చాలాచోట్ల పొలాలను చదును చేసి బరులుగా మారుస్తున్నారు. ఇక కొన్నిచోట్ల అయితే బరుల వద్దే సోఫా సీటింగ్, ACలు, లైవ్ స్క్రీన్స్ కోసం ఆర్డర్స్ వచ్చినట్లు షామియానాల నిర్వాహకులు తెలిపారు. అటు కోడిపుంజులనూ పందెంరాయుళ్లు సన్నద్ధం చేస్తున్నారు. రెగ్యులర్‌గా జీడిపప్పు, బాదం తదితర డైట్ ఫుడ్‌కు తోడు ఎక్కువ ఎక్సర్‌సైజులు చేయిస్తున్నారు.

News January 2, 2026

పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

image

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది.