News October 26, 2025
అప్రమత్తంగా ఉండాలి.. పవన్ కళ్యాణ్ సూచన

మోంథా తుపాను నేపథ్యంలో DyCM పవన్ కళ్యాణ్ శనివారం KKD కలెక్టర్‌తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఏలేరు ప్రజెక్ట్‌పై ఆరా తీశారు. సహాయక చర్యల సన్నద్ధతలో యంత్రాంగం నిమగ్నమైనందున, ప్రస్తుతానికి జిల్లా పర్యటన వద్దని కలెక్టర్ సున్నితంగా సూచించగా, పవన్ అంగీకరించారు.
Similar News
News October 28, 2025
వనపర్తి: మద్యం దుకాణాల లక్కీడిప్.. దంపతులకు బంపర్ లక్కు

వనపర్తి జిల్లాలో మొత్తం 36 మద్యం దుకాణాల కోసం 757 దరఖాస్తులు రాగా, పాన్‌గల్ మండలం వెంగలాయిపల్లి చెందిన దంపతులు గండం ప్రవీణ కుమారి, మొగిలి సురేష్ కుమార్‌లకు అదృష్టం వరించింది. ప్రవీణ కుమారికి గౌడ్ రిజర్వేషన్‌లో పాన్‌గల్-2 దుకాణం దక్కగా, సురేష్ కుమార్ గౌడ్‌కు ఓపెన్ కేటగిరీలో కొత్తకోట-3 దుకాణం లభించింది. ఒకే కుటుంబానికి 2 దుకాణాలు దక్కడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
News October 28, 2025
హరీశ్‌రావు తండ్రి మరణం బాధాకరం: ‘X’లో సీఎం

మాజీ మంత్రి, సిద్ధిపేట MLA హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి Xలో వేదికగా పోస్ట్ చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్‌రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని రాసుకొచ్చారు.
News October 28, 2025
శ్రీరాంపూర్: ‘సింగరేణి మాజీ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి’

సీపీఆర్ఎంఎస్ స్కీమ్‌లో సభ్యత్వం ఉన్న సింగరేణి మాజీ ఉద్యోగులు నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని సంస్థ జీఎం (పర్సనల్) జీవీకే కుమార్ తెలిపారు. డిజిటల్ మాధ్యమంలో జీవన్ ప్రమాణ్ ఆండ్రాయిడ్ ద్వారా మొబైల్ ఫోన్లలో లేదా మీ సేవ కేంద్రంలో సమర్పించి నిరాటంకంగా వైద్య సేవలు పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు తమ ఏరియాలోని ఏటీబీ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.


