News February 28, 2026
అఫ్గానిస్థాన్‌తో అంత ఈజీ కాదు!

అఫ్గానిస్థాన్‌కు ‘సామ్రాజ్యాల శ్మశానం’ అని పేరుంది. 19వ శతాబ్దంలో బ్రిటన్, గత శతాబ్దంలో సోవియట్ యూనియన్, ఇటీవల అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఇక్కడ అడుగుపెట్టి భారీ ప్రాణ, ఆస్తి నష్టంతో వెనుదిరిగాయి. దుర్భేద్యమైన హిందూకుష్ పర్వతాలు, స్థానిక తెగల గెరిల్లా పోరాటాల వల్ల ఏ దేశమూ ఇక్కడ నిలబడలేకపోయింది. చరిత్రలో సామ్రాజ్యాలనే మింగేసిన ఈ గడ్డ ఇప్పుడు పాక్‌కు సవాల్ విసురుతోంది.
Similar News
News March 4, 2026
చెలరేగుతున్న న్యూజిలాండ్

T20WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్ విధ్వంసం సృష్టిస్తోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 84 రన్స్ చేసింది. సీఫర్ట్ (21 బంతుల్లో 41*), అలెన్ (15 బంతుల్లో 43*) బౌండరీలతో విరుచుకుపడుతున్నారు. ఇద్దరూ కలిసి 5 సిక్సర్లు, 9 ఫోర్లు బాదారు.
News March 4, 2026
ఖమేనీ రెండో కొడుకు ఆస్తి ఎంతో తెలుసా?

ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైనట్లు సమాచారం. ఆయనకు బ్రిటన్‌లో 100 మిలియన్ పౌండ్ల విలువైన 11 ప్రాపర్టీస్ ఉన్నట్లు తెలుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా భారీగా ఆస్తులు, గోల్డ్ కూడబెట్టినట్లు నిపుణుల అంచనా. అలాగే ఆఫ్రికన్ దేశాల్లో బ్యాంకులు, స్విస్ బ్యాంకులో ఖాతాలు, ప్రైవేట్ జెట్ ఉన్నాయని తెలుస్తోంది. <<19292894>>IRGC<<>>కి నిధులు సమకూర్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
News March 4, 2026
టమాటా రేట్ల పతనం.. ప్రభుత్వాలు ఇలా చేస్తే?

AP, TGలో టమాటా ధరలు కుప్పకూలిపోయాయి. కిలో ₹2-5కు కొనేందుకూ <<19258574>>వ్యాపారులు<<>> ముందుకు రావట్లేదు. దీంతో రైతులు వృథాగా పంటను పడేస్తున్నారు. ఇలా రేట్లు పడిపోయినప్పుడు టమాటాలతో పచ్చళ్లు, కెచప్/ప్యూరీ, టమాటా పొడి చేసుకునేలా ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. టమాటా విస్తీర్ణం అధికంగా ఉండేచోట ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలను ఏర్పాటు చేయాలి. ఇతర పంటలకూ ఇలాగే ప్రత్యామ్నాయాలను చూపితే రైతులకు స్థిరమైన ఆదాయం ఉంటుంది. ఏమంటారు?


