News February 27, 2026

అఫ్గాన్‌తో పాకిస్థాన్ ‘ఓపెన్ వార్’

image

అఫ్గాన్‌తో ‘ఓపెన్ వార్’ <<19249710>>చేస్తున్నామని<<>> పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ‘ఆపరేషన్ గజబ్’ కొనసాగుతోందన్నారు. అఫ్గాన్‌తో యుద్ధం నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. సౌదీ అరేబియా మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో పాక్ మంత్రి ఇషాక్ ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు తాము పాక్ F-16 ఫైటర్ జెట్ కూల్చివేశామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ఇది పాత వీడియో అని వార్తలొస్తున్నాయి.

Similar News

News February 27, 2026

RARE: ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన చైనా మహిళ

image

చైనాలోని షిన్జియాంగ్‌కు చెందిన 24 ఏళ్ల దిలి అనే మహిళ ‘వుహాన్ యూనివర్సిటీ’ ఆసుపత్రిలో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. 20 మంది వైద్య సిబ్బంది కృషితో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి క్షేమంగా జన్మించారు. సహజసిద్ధంగా ఇలా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం 6 కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుందని వైద్యులు తెలిపారు. తమ కెరీర్‌లో ఇదే అత్యంత అరుదైన ప్రసవమని చీఫ్ డాక్టర్ పేర్కొన్నారు.

News February 27, 2026

హ్యాపీగా ఉండాలంటే ఈ ఆహారం తినండి

image

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందట. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్‌ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.

News February 27, 2026

NHM తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

నేషనల్ హెల్త్ మిషన్(NHM) తూర్పు గోదావరి జిల్లాలో 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(స్పీచ్&లాంగ్వేజ్ పాథాలజీ), పీజీ(చైల్డ్ సైకాలజీ, MA, MSc సైకాలజీ, ఆప్టోమెట్రీ), డెంటల్ టెక్నీషియన్ కోర్సు, GNM అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in