News February 23, 2026

అఫ్గాన్‌పై వైమానిక దాడుల్లో 70 మంది మృతి: పాక్

image

అఫ్గానిస్థాన్‌పై జరిపిన వైమానిక దాడుల్లో 70 మంది ‘ఉగ్రవాదులు’ హతమైనట్లు పాక్ ప్రకటించుకుంది. పాక్‌లో ఇటీవల జరిగిన వరుస ఆత్మాహుతి దాడులకు ప్రతీకారంగానే నంగర్‌హర్, పక్తికా ప్రాంతాల్లోని ‘ఏడు ఉగ్రవాద శిబిరాల’పై విరుచుకుపడ్డామని చెప్పుకొచ్చింది. అయితే, పాక్ చేసిన ఈ ప్రకటనను అఫ్గానిస్థాన్ ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని మండిపడింది.

Similar News

News February 28, 2026

పాక్-అఫ్గాన్ మధ్య అసలు గొడవేంటి?

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య దశాబ్దాల గొడవలకు 1893 నాటి ‘డ్యూరాండ్ లైన్’ సరిహద్దు ఒప్పందమే మూలం. పష్తూన్ ప్రజలను రెండుగా విడగొట్టిన ఈ రేఖను తాము గుర్తించబోమని అఫ్గాన్ మొదటి నుంచీ వాదిస్తోంది. దీనికి తోడు ఇస్లామిక్ పాలనే లక్ష్యంగా పాక్‌లో విధ్వంసం సృష్టించే ‘Tehreek-e-Taliban Pakistan’ ఉగ్రవాదులకు అఫ్గాన్ గడ్డపై ఆశ్రయం లభిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. ఇవే ఇరు దేశాల మధ్య గొడవలకు ప్రధాన కారణాలు.

News February 28, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,160 పెరిగి రూ.1,64,730కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,900 ఎగబాకి రూ.1,51,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 28, 2026

అరుదైన మామిడి.. ఒక్కోటి రూ.1,500

image

బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ‘కోహితూర్’ అనే అరుదైన, ప్రీమియం మామిడి పండ్లను పండిస్తున్నారు. అత్యంత రుచి, మృదువు, ఎక్కువ గుజ్జు కలిగి ఉండటం ఈ రకం ప్రత్యేకత. దీని తోలు సున్నితంగా ఉంటుంది. అందువల్ల కాటన్‌తో చుట్టి ఎగుమతి చేస్తారు. ఒక్కో మామిడి పండు ధర రూ.1,500 వరకు ఉంటుంది. డిమాండ్‌ను బట్టి రూ.2,600 వరకు చేరుతుంది. వీటి విశిష్టత గురించి వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా SMలో చేసిన పోస్టు వైరలవుతోంది.