News February 15, 2026

అఫ్గాన్ ప్లేయర్‌కు బ్యాట్లు గిఫ్టుగా పంపిన కోహ్లీ

image

అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్‌కు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2 బ్యాట్లు బహుమతిగా ఇచ్చారు. T20 WCలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్‌ను అభినందిస్తూ వాటిని పంపారు. దీనికి గుర్బాజ్ స్పందించారు. ‘అత్యంత అద్భుత బహుమతికి ధన్యవాదాలు కోహ్లీ భాయ్. మీరు లెజెండ్ మాత్రమే కాదు.. అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 2 సార్లు <<19111177>>సూపర్ ఓవర్<<>> జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవడం తెలిసిందే.

Similar News

News February 16, 2026

గర్భం దాల్చకుండానే చనుబాలు వస్తున్నాయా?

image

గర్భం దాల్చకపోయినా మహిళల్లో పాలు ఉత్పత్తి కావడాన్ని గెలాక్టోరియా అంటారు. ఈ సమస్య కేవలం మహిళల్లో మాత్రమే కాదు.. పురుషుల్లో కూడా వస్తుంది. ఇది ఎక్కువగా పిట్యూటరీ గ్రంథి, హార్మోన్ల అసమతుల్యత, గర్భనిరోధక మాత్రలు, యాంటీ డిప్రెసెంట్స్, బీపీ, లోదుస్తులు, థైరాయిడ్, అమెనోరియా, హైపోథైరాయిడిజం, కిడ్నీ సమస్యలు, జనన నియంత్రణ మందులు వాడటం, మెంతి, సోంపు వంటి మూలిక మందులు వాడటం వల్ల చనుబాలు ఉత్పత్తి అవుతాయి.

News February 16, 2026

బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు గ్రాండ్ వెల్కమ్

image

AP: అమరావతి పర్యటనకు వచ్చిన బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద గేట్స్‌కు పుష్పగుచ్ఛం అందించి వెల్కమ్ చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌తో బిల్‌గేట్స్ భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చించనున్నారు.

News February 16, 2026

నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్!

image

TG: నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 125 వెంటిలేటర్లు మంజూరు చేయగా రూ.1,698 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ గ్రాంట్లు పెరగగా ఏడాదిలోనే రూ.122 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చాయి.