News January 18, 2025
అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్ విచారణ

అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు దొంగలను ఆటో డ్రైవర్ తీసుకెళ్లారు. దొంగలను వదిలిపెట్టిన ఆటో డ్రైవర్‌ని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్ద దొంగల్ని వదిలిపెట్టినట్టు ఆటో డ్రైవర్ విచారణలో తెలిపారు. ఆటోలో కూర్చున్నప్పుడు దొంగలు ఏమైనా మాట్లాడుకున్నారా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News December 14, 2025
డీలిమిటేషన్.. పోటెత్తిన ఫిర్యాదులు

GHMC వార్డుల డీలిమిటేషన్ మీద అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. 3 రోజుల్లోనే ఏకంగా 693 ఫిర్యాదులు అందడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి రోజు (డిసెంబర్ 10) 40 ఫిర్యాదులు, రెండవ రోజు 280, అత్యధికంగా 373 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లోనే ఈ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీవ్రతను ఈ ఫిర్యాదుల సంఖ్య సూచిస్తోంది.
News December 14, 2025
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్

IT కారిడార్‌లో ట్రాఫిక్‌ను దెబ్బతీస్తున్న కీలకమైన ICCC నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు 9KM ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు HMDA పచ్చజెండా ఊపింది. తాజాగా DPR కోసం టెక్నికల్ కన్సల్టెంట్‌లను ఇన్వైట్ చేసింది. 11.6 కి.మీ. PVNR Expresswayను పోలిన ఈ నూతన మార్గం, నగరంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ వెస్ట్ సిటీకి పర్మినెంట్ ట్రాఫిక్ సొల్యూషన్ అందించనుంది.
News December 14, 2025
ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!

HYDకు వెళ్లగానే అద్దాల మేడలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒక్కసారైనా వాటిలోకి అడుగుపెట్టాలనే ఆశ కలిగించేలా మంత్రముగ్ధులను చేస్తాయి. ఇప్పుడు ఆ అద్భుతాలన్నింటినీ మించిపోయేలా, నగర శివారు ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన బంగ్లాను నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. 72 అంతస్తుల భవన నిర్మాణానికి అగ్నిమాపక శాఖ అనుమతులు కోరినట్లు సమాచారం. దూరం నుంచి గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనిపించడం దీని స్పెషల్.


