News February 8, 2025

అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

image

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 14, 2025

HYD: ఉ.11.30 గంటల్లోపే విజేతపై క్లారిటీ!

image

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనుండగా మొదటి గంటన్నరలోపే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ముందు పోస్టల్ బ్యాలెట్ ఆ తర్వాత EVMలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఉ.11.30లోపు విజేత ఎవరో క్లారిటీ రావొచ్చని అంచనా. గెలుపుపై అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష BRS ధీమా ఉండగా పట్టు నిలుపుకునేందుకు BJP చూస్తోంది.

News November 14, 2025

CSKకి సంజూ శాంసన్!

image

స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK ట్రేడ్ చేసుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి రాజస్థాన్ రాయల్స్‌తో పేపర్ వర్క్ పూర్తయిందని వెల్లడించాయి. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని పేర్కొన్నాయి. అటు జడేజాను వదులుకోవట్లేదని సమాచారం. మరోవైపు శాంసన్ వచ్చే సీజన్‌లో ఎల్లో జెర్సీలో కనిపిస్తారని CSK ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు వెల్‌కమ్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.

News November 14, 2025

A1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

image

మంగళంపేటలో 75.74ఎకరాలకే పట్టాలు ఉండగా.. పెద్దిరెడ్డి కుటుంబం 32.63ఎకరాల అటవీ భూమిని తమ స్థలంలో కలిపేసుకున్నారని PCCFచలపతిరావు వెల్లడించారు. ‘ఏ1గా మిథున్ రెడ్డి, ఏ2గా రామచంద్రారెడ్డి, ఏ3గా ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా ఇందిరమ్మ పేర్లు నమోదు చేశాం. అటవీ భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేసి ఆదాయం పొందారు. చట్ట విరుద్ధంగా బోర్ తవ్వారు. రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లింది’ అని ఆయన చెప్పారు.