News March 1, 2026

‘అబ్రహం లింకన్‌’ షిప్‌పై దాడి జరగలేదు: US

image

తమ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘అబ్రహం లింకన్‌’పై <<19274213>>దాడి<<>> జరిగిందన్న వార్తలను US సెంట్రల్ కమాండ్ ఖండించింది. దాడి చేశామని ఇరాన్ చెప్పిందంతా అబద్ధమని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘లింకన్‌ను ఏ మిస్సైల్ కూడా ఢీకొట్టలేదు. దాని దగ్గరగా కూడా చేరుకోలేదు. ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను తొలగించి అమెరికన్లను రక్షించేందుకు సెంట్రల్ కమాండ్‌తో కలిసి లింకన్ షిప్ విమానాలను ప్రయోగిస్తోంది’ అని స్పష్టం చేసింది.

Similar News

News March 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 11, 2026

శుభ సమయం (11-3-2026) బుధవారం

image

➤ తిథి: బహుళ అష్టమి రా.2.17 వరకు
➤ నక్షత్రం: జ్యేష్ఠ రా.8.24 వరకు
➤ శుభ సమయాలు: ఉ.6.12-8.10, ఉ.9.10-10.09, మ.12.32-మ.3.05, సా.4.04-సా.5.03
➤ రాహుకాలం: మ.12.00-మ.1.30
➤ యమగండం: ఉ.7.30-ఉ.9.00
➤ దుర్ముహూర్తం: ఉ.11.44-మ.12.31
➤ వర్జ్యం: తె.5.13 నుంచి
➤ అమృత ఘడియలు: ఉ.10.38-మ.12.25

News March 11, 2026

LPG ఉత్పత్తిని పెంచుతున్నాం: రిలయన్స్ ఇండస్ట్రీస్

image

గ్లోబల్ ఇంధన మార్కెట్లలో అస్థిరత నేపథ్యంలో LPG ఉత్పత్తిని పెంచుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దేశ ప్రజలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ జామ్ నగర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ హబ్‌లో LPG ఉత్పత్తిని మాక్సిమైజ్ చేసినట్లు పేర్కొంది. భారతీయ కుటుంబాల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని తెలిపింది.