News January 25, 2026
అభిమానికి గోల్డ్ చైన్ ఇచ్చిన రజినీకాంత్

సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానికి బంగారు గొలుసు ఇచ్చారు. మధురైలో పేదల కోసం కేవలం రూ.5కే పరోటా విక్రయిస్తున్న ‘రజినీ శేఖర్’ సేవలను ప్రశంసించారు. శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉండగా, ఏప్రిల్ నుంచి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
Similar News
News February 6, 2026
ఎన్‌కౌంటర్.. ప్రభాకర్ సహా ఏడుగురు మావోలు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నలుగురు మహిళా మావోలు సహా కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభాకర్ కూడా ఉన్నారు. గడ్చిరోలి డివిజనల్ కమిటీ అధిపతిగా ఉన్న ఆయనపై రూ.50 లక్షల రివార్డు ఉంది. ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు కూడా మరణించారు. భమ్రగఢ్ తాలూకా ఫడేవా అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
News February 6, 2026
శ్రీవారిని ఉచితంగా దర్శించుకోండిలా!

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సాధారణ భక్తుల కోసం టీటీడీ పలు ఉచిత దర్శన మార్గాలను కల్పిస్తోంది. సర్వదర్శనం కోసం జనరల్ క్యూలో వెళ్లొచ్చు. టైమ్ స్లాట్ SSD టోకెన్స్‌తో పాటు మెట్ల నడక ద్వారా కొండపైకి వెళ్లి బయోమెట్రిక్ టోకెన్స్ పొందవచ్చు. స్థానిక భక్తులకు లోకల్ కోటా, సీనియర్ సిటిజన్లకు(65+) స్పెషల్ ఎంట్రీతో పాటు ఏడాదిలోపు పిల్లలున్న పేరెంట్స్ ‘సుపథం’ ద్వారా శ్రీవారిని వేగంగా దర్శించుకోవచ్చు.
News February 6, 2026
ఇప్పటివరకు U-19 మెన్స్ ప్రపంచకప్ విజేతలు

భారత్ అన్ని జట్ల కంటే ఎక్కువగా 6 సార్లు ప్రపంచకప్ సాధించింది.
1988- ఆస్ట్రేలియా, 1998- ఇంగ్లండ్
2000- భారత్, 2002- ఆస్ట్రేలియా
2004- పాకిస్థాన్, 2006- పాకిస్థాన్
2008- భారత్, 2010- ఆస్ట్రేలియా
2012- భారత్, 2014- సౌతాఫ్రికా
2016- వెస్టిండీస్, 2018- భారత్
2020- బంగ్లాదేశ్, 2022- భారత్
2024- ఆస్ట్రేలియా, 2026- భారత్


