News October 2, 2024

అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్

image

రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పిలుపునిచ్చారు. ఆ దిశగా స్వర్ణాంధ్ర- 2047 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో ప్రజలు పాల్గొనాలని సూచించారు. “https://swarnandhra.ap.gov.in” వెబ్సైట్ ఓపెన్ చేసి పేరు, వయస్సు, జిల్లా తదితర వివరాలను పూర్తిచేసిన తర్వాత వచ్చే 11 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Similar News

News October 2, 2024

సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

image

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో CM చంద్రబాబు నాయుడును ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా తనను నియమించిన సందర్భంగా సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం సైతం మాగుంటకు శుభాకాంక్షలు తెలిపారు.

News October 2, 2024

బాలినేని సైలెంట్‌కు కారణం అదేనా..?

image

ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. జనసేన గూటికి చేరిన తర్వాత ఒంగోలుకు వచ్చిన బాలినేనికి ఆ పార్టీ నాయకులు కలిసి మద్దతు పలికారు. జనసేనలోకి భారీ చేరికలు ఉంటాయని బాలినేని అప్పుడు ప్రకటించినా.. సైలెంట్ అయ్యారు. పవన్ దీక్షలో ఉండటంతోనే బాలినేని సైలెంట్ అయ్యారని.. తెర వెనుక పక్కా ప్లాన్‌తో చేరికలపై అడుగులు వేస్తున్నట్లు చర్చ సాగుతోంది.

News October 2, 2024

ఒంగోలు: రైలు కిందపడి వివాహిత సూసైడ్

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒంగోలులో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక కేశవస్వామిపేటకు చెందిన దంపతులు శ్రుతి- ప్రసాద్ క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శ్రుతి భర్తకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే SI అరుణకుమారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదైంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.