News November 4, 2025
అభివృద్ధికి నోచుకోని కందగిరి.. బండరాళ్లే మెట్లు!

జిల్లాలోని కురవి(M) కందికొండ శివారు కందగిరి కొండపై ప్రాచీన కాలం నాటి కట్టడాలు ఉన్నా, అభివృద్ధి జాడ కనిపించడం లేదు. రెండున్నర కి.మీ. ఎత్తులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు బండరాళ్లే మెట్లుగా చేసుకుని ఎక్కుతున్నారు. గతంలో కేటీఆర్ ఇక్కడ మెట్లు నిర్మిస్తామని హామీ ఇవ్వగా, 2019లో శంకుస్థాపనతోనే ఆ పనులు నిలిచిపోయాయి. పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు.
Similar News
News November 4, 2025
భారీ జీతంతో ఆర్మీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇంజినీరింగ్ పూర్తైన, చివరి సంవత్సరం చదువుతున్నవారు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)లో చేరేందుకు ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ మార్కుల మెరిట్‌తో ఎంపిక చేస్తారు. ఏడాది శిక్షణలో రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత మొదటి నెల నుంచే రూ.లక్ష వరకు శాలరీ ఉంటుంది. పెళ్లికాని 20-27ఏళ్ల మధ్య ఉన్న పురుషులు అర్హులు. ఇక్కడ <
News November 4, 2025
‘ది రాజాసాబ్’ విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మూవీ టీమ్ ఖండించింది. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News November 4, 2025
మెదక్: మరి కాసేపట్లో భారీ వర్షం

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని.. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.


