News October 7, 2024
అభివృద్ధిలో మరో ముందడుగు పడింది: MLA సుజనా

NDA ప్రభుత్వ పాలనలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని విజయవాడ పశ్చిమ MLA సుజనా ట్వీట్ చేశారు. రూ.25 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని సుజనా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాజధాని నుంచి సమీప జిల్లాలలో ప్రాంతీయ ప్రగతి మరింత పెరగనుందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
Similar News
News July 7, 2025
మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వివినియోగం చేసుకోవాలని కోరారు.
News July 6, 2025
వీరపనేనిగూడెంలో ప్రమాదం.. ఒకరి మృతి

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తెంపల్లికి చెందిన షేక్ యూసఫ్ బాషా (28) మృతి చెందాడు. తాపీ పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ఇటుకబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News July 5, 2025
ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారుల ప్రతిభ

మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతున్న 9వ జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో కృష్ణా జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికైనట్లు కోచ్ విజయ్ తెలిపారు. జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా జిల్లా క్రీడా కారులు తమ ప్రతిభను దేశస్థాయిలో చాటుకున్నారని కోచ్ చెప్పారు.