News December 27, 2025
అభివృద్ధి ఎక్కడ? కేవలం బూతుల పురాణమేనా?: బండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాజకీయాలపై X వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని ఆయన “వర్బల్ డయేరియా”గా అభివర్ణించారు. నాయకులు అభివృద్ధిని విస్మరించి, బూతులు తిట్టుకుంటూ రాజకీయాలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, రైతుల మద్దతు, ఉద్యోగాల గురించి మాట్లాడకుండా కేవలం ఒకరినొకరు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
Similar News
News January 3, 2026
దువ్వాడ అడుగు ఎటువైపు ?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ ప్రయాణంపై శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బలమైన సామాజిక వర్గం నుంచి పాలిటిక్స్‌లోకి ఆయన వచ్చారు. ఏడాది క్రితం ఆయన వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురికాగా.. పలు ఇంటర్వ్యూల్లో ఇది తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు. జిల్లాలో మారుతున్న పొలిటికల్ సమీకరణాల దృష్ట్యా BJPలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై దువ్వాడ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
News January 3, 2026
మితిమీరిపోతున్న ‘గ్రోక్ బికినీ’ ట్రెండ్..!

కేంద్రం సీరియస్ అయినప్పటికీ Xలో ‘గ్రోక్ బికినీ’ <<18744769>>ట్రెండ్<<>> ఆగలేదు. గతంలో కంటే ఇంకా ఎక్కువ అసభ్యతను యూజర్లు కోరుతూ శునకానందం పొందుతున్నారు. న్యూడిటీని ఇంకా పెంచాలని, లెగ్స్‌ని స్ప్రెడ్ చేయాలని ‘గ్రోక్’ని ఆదేశిస్తూ మితిమీరిపోతున్నారు. వీటిని కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సభ్యసమాజం చూస్తుందనే భయం లేకుండా ఇలాంటి ట్వీట్స్ చేసిన వారిని శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News January 3, 2026
సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయం: వీసీ

మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు ఆదర్శప్రాయమని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. జిఎన్ శ్రీనివాస్ అన్నారు. శనివారం వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యవక్తగా న్యాయవాది జనార్దన్ పాల్గొని ప్రసంగించగా, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. ప్రవీణ అధ్యక్షత వహించారు.


