News October 6, 2025

అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష

image

ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు స్థితిని సమీక్షించడానికి, కేంద్రప్రభారి అధికారి సోలామన్ అరోకియా రాజ్, అదనపు కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ, సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లా ప్రధాన కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, వ్యవసాయ, మహిళా, ఇతర అభివృద్ధి సంబంధిత కేంద్రాలను పరిశీలించి, కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలసి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News October 7, 2025

కామారెడ్డి: గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీజీ సోషల్ వర్క్ విద్యార్థులకు బోధించడాని ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయ్ కుమారు తెలిపారు. అభ్యర్థులు సోషల్ వర్క్ సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పాసై ఉండాలన్నారు. (ఎస్సీ/ఎస్టీలకు కనీసం 50 శాతం) పీహెచ్‌డీ/ నెట్/ సెట్/ బోధనానుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 7, 2025

సంగారెడ్డి: నేషనల్ స్కాలర్షిప్‌కు అవకాశం

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల14 వరకు పొడిగించినట్లు DEO వెంకటేశ్వర్లు తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 7, 2025

పులివెందులలో MP అవినాశ్ ప్రజా దర్బార్

image

కడప పార్లమెంట్ సభ్యుడు YS అవినాశ్‌రెడ్డి సోమవారం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను ఎంపీకి తెలియజేశారు. ప్రజల ఆవేదనను ఆలకించిన అవినాశ్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ వీరివెంట ఉన్నారు.