News July 7, 2025

అభివృద్ధి పథకాలపై ప్రణాళికను ఏర్పాటు చేయాలి- కలెక్టర్

image

కేంద్ర అభివృద్ధి పథకాలపై ఈనెల 9న జరగనున్న దిశ సమావేశానికి సంబంధించి అధికారులు పూర్తి నివేదికలతో, లక్ష్యాల సాధనకు తగిన ప్రణాళికతో హాజరవ్వాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ముందస్తు ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి శాఖ ప్రగతిపై సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

Similar News

News July 8, 2025

ఆర్టీసీ వరంగల్-2 డిపో డీఎంగా రవిచందర్

image

వరంగల్ రీజియన్‌లోని వరంగల్-2 డిపో మేనేజర్‌గా ఎం.రవిచందర్‌ను నియమిస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం వరంగల్-2 డిపో మేనేజర్‌గా పనిచేసిన జ్యోత్స్న ఖమ్మం రీజియన్ ఏవోగా బదిలీ అయ్యారు. దీంతో పరకాల డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న రవిచందర్‌ను వరంగల్-2 డిపోకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.

News July 8, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 8, 2025

లైంగిక ఆరోపణలు.. దయాల్‌పై FIR నమోదు

image

పేసర్ యష్ దయాల్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాపురం PSలో FIR నమోదైంది. అతనిపై ఘజియాబాద్ యువతి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె CM గ్రీవెన్స్ పోర్టల్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 69 ప్రకారం దయాల్‌పై కేసు నమోదు చేశారు. పెళ్లి, ఉద్యోగం వంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనల్లో ఈ సెక్షన్ వాడతారు. నేరం రుజువైతే అతనికి పదేళ్ల వరకు శిక్ష పడుతుంది.