News March 17, 2025
అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించం: మంత్రి పొంగులేటి

అభివృద్ధి పథకాలు అడ్డుకుంటే సహించమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిన్న ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. పేదల కలలను సాకారం చేస్తూ మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చామన్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టేవిధంగా ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తోందన్నారు.
Similar News
News March 17, 2025
విజయవాడ: నకిలీల ఘటనపై స్పందించిన ఏసీపీ

నకిలీ పోలీసులు, నకిలీ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచించారు. సోమవారం మాచవరం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు, మీడియా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను ఎవరైనా బెదిరిస్తే నిస్సంకోచంగా పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదన్నారు.
News March 17, 2025
శ్రీ సత్యసాయి జిల్లా: ‘ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించాలి’

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఉపాధి హామీ పథకం కూలీలకు 10 వారాల బకాయిలు చెల్లించాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు విన్నవించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు.
News March 17, 2025
బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన పొన్నం

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా బిల్లులను తీసుకొచ్చింది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.