News April 3, 2025
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: ASF కలెక్టర్

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసి 100 శాతం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనుల పురోగతి, ఎంబీ రికార్డులపై ఆరా తీశారు.
Similar News
News September 19, 2025
జగన్‌లా గతంలో ఎవరూ ఇంట్లో కూర్చోలేదు: సోమిరెడ్డి

AP: వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలికి వచ్చి ప్రశ్నిస్తుంటే, మాజీ సీఎం జగన్ శాసనసభకు ఎందుకు రావట్లేదని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రతిపక్ష హోదా కోసం గతంలో ఏ నాయకుడూ జగన్‌లా ఇంట్లో కూర్చోలేదని ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేస్తే, ప్రతిపక్ష హోదా కావాలని కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
News September 19, 2025
భీమడోలు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదు

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటలలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భీమడోలు మండలంలో అత్యధికంగా 16.2 మి.మీ., నూజివీడులో 2.8 మి.మీ, చాట్రాయిలో 1.8 మి.మీ, అగిరిపల్లిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన 24 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 22.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 0.8 మి.మీ.గా ఉందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు.
News September 19, 2025
సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.