News February 10, 2026

అభివృద్ధి పనుల్లో స్పష్టమైన పురోగతి చూపాలి: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో అన్ని శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఖచ్చితమైన పురోగతి కనిపించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మార్చిలో జరిగే కలెక్టర్ల సమావేశం నాటికి అన్ని విభాగాల్లో ఫలితాలు చూపాలని సూచించారు. జాబ్ మేళాల ద్వారా 7 నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించాలని, PGRS ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు.

Similar News

News February 17, 2026

పన్నుల వసూళ్లలో పురోగతి సాధించాలి: కలెక్టర్ ఆదేశం

image

ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో మున్సిపల్ అధికారులు మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ట్రేడ్ లైసెన్సులు, భవన అనుమతులు, పెండింగ్ లేఅవుట్ పర్మిషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపల్ కమిషనర్లు పాల్గొని తమ పరిధిలోని పురోగతిని వివరించారు.

News February 17, 2026

రమేశ్ కుటుంబానికి మందకృష్ణ మాదిగ పరామర్శ

image

తుగ్గలి మండలం బొందిమడుగులలో దారుణ హత్యకు గురైన రమేశ్ కుటుంబాన్ని మంగళవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. దళిత నాయకుడి హత్యను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసు అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

News February 17, 2026

కర్నూలులో 65 ఫిర్యాదుల స్వీకరణ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భూ ఆక్రమణ, ఉద్యోగ మోసాలు, లోన్ మోసాలు, బెదిరింపులపై పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, సీఐలు పాల్గొన్నారు.