News July 31, 2024
అభివృద్ధి వైపు పయనిస్తున్న ఏపీ: అనకాపల్లి ఎంపీ

ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి వైపు ప్రయాణిస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. రాష్ట్రంలో ఐదు గ్రీన్ ఫీల్డ్ కారిడార్లు భారత్ మాల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్నట్లు X ద్వారా పేర్కొన్నారు. నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లలో హైదరాబాద్-విశాఖ కారిడార్, బెంగళూరు చెన్నై ఎక్స్ ప్రెస్ వే, రాయపూర్-విశాఖపట్నం కారిడార్, చిత్తూరు- థాచూర్ కారిడార్, బెంగళూరు- కడప-విజయవాడ కారిడార్ ఉన్నాయన్నారు.
Similar News
News December 7, 2025
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు 279 మంది హాజరు

విశాఖలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష ఆదివారం జరిగింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 349 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 279 మంది హాజరయ్యారని డైరెక్టర్ కె.రాజేశ్వరి తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. ఎంపికైన వారికి సివిల్స్ పరీక్షకు శిక్షణ ఇస్తామన్నారు.
News December 7, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.