News December 27, 2024

 అభ్యంతరాలు ఉంటే 31లోపు తెలపండి: కలెక్టర్ 

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. దీనిపై జిల్లాలోని ఎస్సీ పౌరులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు సచివాలయాల్లో అందించాలని తెలిపారు.

Similar News

News December 28, 2024

ప్రకాశం: పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారా?.

image

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఈనెల 30న ప్రారంభమై జనవరి 10 వరకు జరగనున్నాయి. మొత్తం 5,345 మంది హాజరు కానుండగా.. అందులో 4,435 మంది పురుషులు, 910 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా డబ్బు కడితే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేస్తారని SP అన్నారు. ఎవరైనా ఇలా నగదు వసూలుకు పాల్పడితే 9121102266కు కాల్ చేయాలన్నారు.

News December 28, 2024

ఒంగోలు: పదో తరగతి‌ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

జిల్లాలో వచ్చే సంవత్సరం జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజును తత్కాల్ కింద వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. రూ.1000 జరిమానా రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వచ్చే నెల 10వ తేదీలోపు ఆన్‌లైన్లో నామినల్ రోల్స్ అందజేయాలని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

News December 28, 2024

జపనీస్ భాషపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా జపనీస్ భాషపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న డిమాండుకు అనుగుణంగా కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.