News January 3, 2026
అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు.. ఖమ్మం, హైదరాబాద్‌లో సెంటర్లు!

జగిత్యాల జిల్లాలో టెట్ అభ్యర్థులకు సొంత జిల్లాలో కాకుండా ఖమ్మం, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో వేయడంతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు సార్లు కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం కూడా సెంటర్ చాలా దూరం ఉండటంతో ముఖ్యంగా మహిళలు పరీక్షలకు గైర్హాజరు అవుతున్నారు. టెట్ ఫీజు 1000/- చెల్లించి అంత దూరం వెళ్లలేక మానుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో KNR, JGTL, PDPL సెంటర్లు ఉండగా అక్కడ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News January 3, 2026
న్యూజిలాండ్‌తో ODI సిరీస్‌కు భారత్ టీమ్ ఇదే

జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా.. షమీకి మాత్రం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
టీమ్: గిల్(C), రోహిత్, కోహ్లీ, రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, జైస్వాల్.
News January 3, 2026
NLG: నీటి వాటాలో ‘తెలంగాణ’కు ద్రోహం: మంత్రి ఉత్తమ్

కృష్ణ, గోదావరి జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చుక్క నీటిని కూడా బయటకు పోనివ్వబోమని స్పష్టం చేశారు.
News January 3, 2026
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : ఎస్పీ

వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈనెల 28 వరకు పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలంటే ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.


