News April 10, 2025
అమరజీవి జయంతి ఉత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

పీసీ పల్లి మండలంలో ఈనెల 16వ తేదీన జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి స్వామిని ఆర్యవైశ్య నాయకులు ఆహ్వానించారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను గురువారం కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2025
క్రికెట్ బెట్టింగ్ కేసులో సింగరాయకొండ వాసి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సింగరాయకొండకు చెందిన వైసీపీ నేత వెంకట్రావు గురువారం అరెస్టయ్యారు. బెట్టింగ్‌లో ఓడిపోయిన కడప వాసి సతీశ్ కుమార్ వెంకట్రావుకు రూ. 2 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ఆ నగదు కోసం వేధిస్తున్నాడని సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించి నెల్లూరు జైలుకు తరలించారు.
News April 18, 2025
తిరుమలలో ఒంగోలు వాసుల కారు దగ్ధం

తిరుమలలో ప్రమాదం తప్పింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. కారులో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే భక్తులు దిగేశారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. వాహనం మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News April 18, 2025
ఒంగోలు: ‘వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలి’

తాగునీటి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రమూ సహించబోనని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. RWS అధికారులతో గురువారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై సమీక్షించారు. వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను, సిబ్బందిని ఆమె ఆదేశించారు. అవసరమైన ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.