News October 25, 2025
అమరవీరులను స్మరిస్తూ సైకిల్ ర్యాలీ పాల్గొనండి: వరంగల్ సీపీ

శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ ఈనెల 27న సీపీ కార్యాలయం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. యువతీ, యువకులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించాలని ఆయన కోరారు.
Similar News
News October 25, 2025
రంప: ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు

విద్యార్థులు మానసిక, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య ఆశ్రమ ఉన్నత పాఠాశాలల హెచ్‌ఎంకు సూచించారు. శనివారం జడ్డంగి, తాళ్ళపాలెం (రాజవొమ్మంగి) గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను చూశారు. విద్యార్థినీ, విద్యార్థులుతో మాట్లాడారు. హెచ్‌ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు ఉన్నారు
News October 25, 2025
ఎర్రిస్వామి గురించి అప్పుడే తెలిసింది: ఎస్పీ

AP: కర్నూలు బస్సు ప్రమాదంపై SP విక్రాంత్ పాటిల్ మరిన్ని విషయాలు వెల్లడించారు. ‘బైక్‌పై మరో వ్యక్తి ఉన్నాడని తెలిసి తుగ్గలి వెళ్లి ఆరా తీశాం. అప్పుడే ఎర్రిస్వామి గురించి తెలిసింది. అతడు HYD GHMCలో పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళ్తుండగా వర్షం వల్ల బైక్ స్కిడ్ అయింది. బస్సులో 250 స్మార్ట్‌ఫోన్ల రవాణాపై FSL నివేదిక తర్వాత స్పష్టత వస్తుంది’ అని వెల్లడించారు.
News October 25, 2025
జనగామ నుంచి పంచారామాలకు ఆర్టీసీ బస్సులు

జనగామ డిపో నుంచి కార్తీక మాసం టూర్ ప్యాకేజీలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. ఈ అవకాశాన్ని యాత్రీకులు సద్వినియోగం చేసుకునాలని ఆమె కోరారు. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతి ఆదివారం పంచారామాలకు జనగామ నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరుతాయని వివరాలకు 9701662166, 7382852923 నంబర్లకు సంప్రదించాలని కోరారు.


