News October 25, 2025

అమరవీరుల త్యాగాలు వృథా కావు: ఎస్పీ

image

పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ వృథా కావని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసులు శాంతి భద్రతలకే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారని ఎస్పీ తెలిపారు. అమరుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Similar News

News October 25, 2025

ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి: CBN

image

AP: మొంథా తుఫాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని CM CBN ఆదేశించారు. తీర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ‘జిల్లాలకు ఇన్ఛార్జిల్ని వేయాలి. అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి. కాకినాడలో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ సేవల్ని అందించాలి. 100 KM వేగంతో గాలులు, 100MM మేర వర్షాలు పడతాయి. ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News October 25, 2025

బేకరీపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు

image

వరంగల్‌ ఫోర్టు రోడ్డులోని ఓ బేకరీ షాపుపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. గడువు తీరిన, నాణ్యత లేని రూ.11 వేల విలువైన తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం షాపు యజమానిని మున్సిపల్‌ ఆరోగ్య విభాగానికి అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌ తెలిపారు.

News October 25, 2025

భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమం కింద రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె, భూభారతి దరఖాస్తులపై సమీక్ష జరిపారు. పెండింగ్‌లో ఉన్న ఆర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని సూచించారు.