News March 25, 2025

అమరావతికి బయలుదేరిన తిరుపతి కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నుంచి రెండు రోజులపాటు అమరావతిలో నిర్వహించుకున్న కలెక్టర్ సదస్సుకు సోమవారం తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల సదస్సులో జిల్లా ప్రగతి, ప్రాజెక్టుల పురోగతి, పలు అభివృద్ధి కార్యక్రమాలు సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రికి ఆయన అందించనున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించి వివిధ అంశాలతో నివేదికలను అధికారులు సిద్ధం చేశారు.

Similar News

News September 16, 2025

ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బీర్ల ఐలయ్య

image

జనగామ కలెక్టరేట్లో బుధవారం జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.58 గంటలకు జనగామ కలెక్టరేట్‌కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలన దినోత్సవాలకు కలెక్టరేట్ లో సభా ప్రాంగణం, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.

News September 16, 2025

SRCL: ‘ఓటర్ జాబితా స్పెషల్ రివిజన్ కట్టుదిట్టంగా చేపట్టాలి’

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. 2022 సం. ఓటర్ల జాబితాతో తాజా జాబితాను పోల్చి, డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ధృవీకరణ చేసి, సెప్టెంబర్ 22లోపు జాబితా సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

News September 16, 2025

దసరా పండగకు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలి: కలెక్టర్

image

బతుకమ్మ, దసరా పండుగలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి ఈ నెల 21 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న బతుకమ్మ, దసరా సంబరాలపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్ మండల ప్రత్యేక అధికారులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.