News December 10, 2025
అమరావతికి రానున్న జాతీయ ఫోరెన్సిక్ వర్సిటీ

ఉగాండా హత్యకేసులో హంతకుడిని DNAతో పట్టించిన అదే NFSEU త్వరలో అమరావతిలో నెలకొననుంది. హత్యాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను, సీసీ టీవీ పుటేజీలను శాస్త్రీయంగా విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన వర్సిటీ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశంలో ఉగ్రవాద కేసుల దర్యాప్తుల్లోనూ ఈ వర్సిటీ కీలక పాత్ర పోషించింది. అమరావతిలో శాఖ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు CM చంద్రబాబుకు ఇచ్చినట్లు వీసీ తెలిపారు
Similar News
News December 15, 2025
కోనసీమ: కొబ్బరి రైతులకు కేంద్రం తీపి కబురు

కొబ్బరికి మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. మిల్లింగ్ కొబ్బరికి క్వింటా రూ.445, బంతి కొబ్బరికి రూ.400 మద్దతు ధర పెంచారు. ఈ పెంపుతో మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటా రూ.12,027, బంతి కొబ్బరి ధర రూ.12,500కు పెరిగింది. జిల్లాలో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. మద్దతు ధర పెంపుతో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 15, 2025
‘అనకాపల్లి జిల్లాలో రబీ సీజన్‌లో 15,630 హెక్టార్లలో పంటల సాగు’

అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది రబీలో 15,630 హెక్టార్లలో పంటల సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా 14,559 టన్నుల ఎరువులు అవసరమని గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి తెలిపారు. ఇప్పటికే 7,120 టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉందన్నారు. ఈ నెలాఖరులో మరో 1,704 టన్నుల యూరియా జిల్లాకు వస్తుందని వెల్లడించారు. నానో ఎరువులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
News December 15, 2025
KMR: 70 ఏళ్ల వయసులో సర్పంచ్

రెండో విడత స్థానిక ఎన్నికల్లో నిజాంసాగర్ (M) నర్సింగ్ రావుపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన 70 ఏళ్ల అభ్యర్థి అంజలీదేవి సర్పంచ్‌గా విజయం సాధించారు. వయస్సు రాజకీయాలకు అడ్డుకాదని నిరూపిస్తూ ప్రజల మద్దతుతో గెలుపొందారు. అనుభవం, నిబద్ధతే తన విజయానికి కారణమన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.


