News November 4, 2025

అమరావతికి రూ.32,500 కోట్ల అదనపు రుణాలు

image

అమరావతి రాజధాని నగరం అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా ఆర్థిక సంస్థల నుంచి భారీగా రుణాలు అందనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి ₹14,000 కోట్లు రుణం అందే అవకాశం ఉంది. దీనితో పాటు, నాబ్‌ఫిడ్ నుంచి ₹10,000 కోట్లు, నాబార్డు నుంచి ₹7,000 కోట్లు రానున్నాయి. ఈ కొత్త నిధులతో కలిపి, సీఆర్డీఏకు ₹58,500 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. CRDA ఇప్పటికే ₹91,639 కోట్ల విలువైన 112 నిర్మాణ పనులను చేస్తోంది.

Similar News

News November 4, 2025

GNT: మోటార్ వాహనాలకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు

image

దివ్యాంగులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు మంజూరుకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డీ.డీ దుర్గాబాయి తెలిపారు. వంద శాతం సబ్సీడీతో ఈ వాహనాలు అందించడం జరుగుతుందని చెప్పారు. www.apdascac.ap.gov.inలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని తెలిపారు.

News November 4, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 37,640 టిక్కీలు అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 40,415 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక ఓ ప్రకటనలో తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 37,640 అమ్మకం జరిగినట్లు చెప్పారు. ఇంకా యార్డు ఆవరణలో 7,834 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు రకాలుగా నమోదయ్యాయన్నారు.

News November 4, 2025

తెనాలి: ప్రభుత్వ పథకాల పేరుతో వృద్ధురాళ్లకు టోకరా

image

ప్రభుత్వ పథకం కింద తక్కువ ధరకు టీవీ, ఫ్రిడ్జ్‌ వంటి వస్తువులు ఇస్తామని, తీసుకోకుంటే పథకాలు ఆగిపోయాయని తెనాలి వీఎస్సార్‌ కళాశాల రోడ్డులో నివసించే 60 ఏళ్ల బొద్దులూరి సీతామహాలక్ష్మికి, గంగానమ్మపేటకు చెందిన లింగమల్లు ఆమనికి గుర్తు తెలియని వ్యక్తులు టోకరా వేశారు. ఒకరి వద్ద రూ.40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు తీసుకుని పత్తాలేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తెనాలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.