News August 25, 2025
అమరావతిలో ఆగస్టు 29న జాబ్ మేళా

తుళ్లూరులోని CRDA కార్యాలయంలో ఈనెల 29న 300కు పైగా ఉద్యోగాల భర్తీకై జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని తన కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో SSC, ITI, ఇంటర్, డిగ్రీ, BSC నర్సింగ్, డిప్లొమా, PG, బీటెక్ చదివినవారు హాజరుకావొచ్చని చెప్పారు. వివరాలకు ఫెసిలిటేటర్స్ లేదా 9848424207, 9963425999 సంప్రదించాలన్నారు.
Similar News
News August 25, 2025
భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్ నాగలక్ష్మి

భూగర్భ జలవనరులను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇందుకోసం జలవనరులు, గ్రామీణ నీటిపారుదల, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని ఆమె ఆదేశించారు. సోమవారం భూగర్భ జలవనరుల పరిరక్షణ, ఈపీటీఎస్, స్వామిత్వా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
News August 25, 2025
తెనాలి: వందేళ్లు దాటినా కష్టాలే.. పింఛన్ కోసం వృద్ధుడి ఆవేదన

తెనాలిలోని మల్లెపాడుకు చెందిన శతాధిక వృద్ధుడు భూషయ్య దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన ఈయన, ప్రస్తుతం వారి ఆదరణకు నోచుకోక జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఆలపాటి ధర్మారావు హయాంలో యడ్లపల్లి పంచాయతీ మెంబరుగా పనిచేశారు. భూషయ్యకు వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛను కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
News August 25, 2025
గుంటూరు జిల్లాలో 5,85,615 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు

గుంటూరు జిల్లాలోని 5,85,615 కుటుంబాలకు ఈ నెల 30 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఏటీఎమ్ కార్డు మాదిరిగా, క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేస్తారు. ఈ కొత్త సాంకేతిక కార్డులతో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.