News December 24, 2025

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. మంత్రుల కమిటీ ఏర్పాటు

image

అమరావతిలో ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ విగ్రహం, స్మారక కేంద్రం పనుల పర్యవేక్షణకు ఏపీ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని నియమించింది. విగ్రహ డిజైన్, స్థలం ఖరారు, డీపీఆర్ పరిశీలన, చెరువు చుట్టూ వాణిజ్య అభివృద్ధిపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. పురపాలక, ఆర్థిక, పర్యాటక, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖల మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

Similar News

News December 25, 2025

NEW YEAR: HYDలో సరికొత్తగా!

image

HYDలో న్యూ ఇయర్ వేడుకలు కేవలం పబ్‌లకే పరిమితం కాకుండా ‘ఓపెన్ టు ఆల్’ పద్ధతిలో సాగనున్నాయి. పర్యాటక శాఖ బాణసంచా కాలుష్యాన్ని అరికట్టేందుకు ట్యాంక్‌బండ్, చార్మినార్ వద్ద మెగా డ్రోన్ షోలను ప్లాన్ చేస్తోంది. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల గట్లపై తొలిసారిగా లైవ్ మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్‌తో వేడుకలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా నగరం వెలుపల 3 భారీ కౌంట్‌డౌన్ ఈవెంట్లకు అనుమతించింది.

News December 25, 2025

తిరుమలలో నెల్లూరు జిల్లా కలెక్టర్… జిల్లా ప్రధాన న్యాయమూర్తి

image

తిరుమలలో గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం సందర్భంగా అనుకోకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ కలుసుకున్నాను. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేలా స్వామివారి కృప కటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

News December 25, 2025

జనవరి 2 నుంచి 9 వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : కలెక్టర్

image

రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు, తిరిగి సర్వే చేయబడిన గ్రామాల్లో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను 2026 జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. పంపిణీ ప్రక్రియలో వెబ్‌ల్యాండ్ రికార్డులతో ముద్రిత పాస్ పుస్తకాలను పూర్తిగా క్రాస్ చెక్ చేయాన్నారు. సంబంధిత పట్టాదారుల బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా మాత్రమే పాసు పుస్తకాలు అందజేయాలన్నారు.