News November 24, 2025
అమరావతిలో ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కానీ సమస్యలు ఇవే..!

అమరావతి ప్రాంతంలో గ్రామ కంఠాలు, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన వీధి పోట్లు సమస్య రైతులను తీవ్రంగా వెంటాడుతుంది. CRDA అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రాజధాని ఏర్పడిన నాటి నుంచి ఈ సమస్య పరిష్కరించకుండా ఒంటెద్దుపోకడి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటున్నారు.
Similar News
News November 24, 2025
చీరలతో మహిళల మనసు.. రిజర్వేషన్లతో రాజకీయ లెక్కలు!

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో సందడి నెలకొనగా, మహిళలకు దగ్గరవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లే కనిపిస్తోంది. వచ్చే నెల స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని చూసుకోవాలన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు రిజర్వేషన్ల ప్రకటన రాజకీయ సందడి పెంచి, పార్టీల్లో లెక్కలు-వ్యూహాలు మార్చే పరిస్థితి తీసుకొచ్చింది.
News November 24, 2025
సిరిసిల్ల: తల్లడిల్లిన తల్లి శునకం

మాటలు రాకున్నా ప్రేమ చూపించడంలో జంతువులు మనుషులకంటే ఎక్కువని రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేటలో రుజువైంది. అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై ఆడుకుంటున్న ఒక కుక్క కూనపై నుంచి వడ్ల లోడుతో వచ్చిన లారీ వెళ్లడంతో అది మృత్యువాత పడింది. దీంతో తల్లి శునకం రోజంతా ఆ చనిపోయిన కూన పక్కనే కూర్చుని, కదలక, మెదలక తల్లడిల్లిన హృదయ విదారక దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
News November 24, 2025
సందీప్ వంగా డైరెక్షన్ టీమ్‌లో స్టార్ కిడ్స్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ జరగగా, డైరెక్షన్ టీమ్ ఆయనతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలో హీరో రవితేజ కుమారుడు మహాదన్, డైరెక్టర్ త్రివిక్రమ్ తనయుడు రిషి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.


