News April 6, 2025
అమరావతిలో కొత్త రైలు మార్గానికి శుభారంభం

ఎర్రుపాలెం-నంబూరు మధ్య నూతన రైల్వేలైన్ నిర్మాణానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ మేరకు అమరావతి మీదుగా వెళ్లే ఈ మార్గానికి భూసేకరణలో పురోగతి కనిపించడంతో, రైల్వేశాఖ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. తొలి దశలో 27 కిలో మీటర్ల రైలు ట్రాక్, కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి టెండర్‌లు రెండు నెలల్లో పిలవనున్నట్లు సమాచారం.
Similar News
News April 7, 2025
మంగళగిరి: వేసవి వచ్చే సరికి మట్టి కుండలకు మార్కెట్ జోష్

మంగళగిరిలో మట్టి పాత్రల తయారీ మళ్లీ ఊపందుకుంది. 300కి పైగా కుటుంబాలు ఈ సంప్రదాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయి. వేసవిలో పెరిగిన డిమాండ్‌తో రోజుకు 15 కుండల వరకు తయారు చేస్తూ జీవనా ధారం చేసుకుంటున్నారు. ఎర్రమట్టి కొరత సమస్యగా మారినప్పటికీ కుటుంబాలంతా పట్టుదలతో వృత్తిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇక్కడి మట్టి కుండలు ఎగుమతవుతుండటం విశేషం. ఒక్కొక్క కుండ ధర సుమారు రూ.100 వరకు పలుకుతుంది.
News April 7, 2025
తాడేపల్లి: ఆర్థిక వివాదం.. యువకుడి హత్య

తాడేపల్లిలో ఓ యువకుడు హత్య కలకలం రేపింది. ఆదివారం జరిగిన హత్యపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక వివాదంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది హత్యకు దారితీసిందన్నారు. భరత్ అనే యువకుడు వర్ధన్ అనే యువకుడిని కత్తితో పొడవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధన్ మృతిచెందాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News April 7, 2025
గుంటూరులో మెగా జాబ్ మేళా

గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహణకు GMC సిద్ధమవుతోంది. స్మార్ట్ టెక్స్, జీఎంసీ సంయుక్తంగా ఈనెల 9న విజ్ఞాన మందిరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతిపైగా అర్హత కలిగిన నిరుద్యోగుల కోసం 50కుపైగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం నుంచి తమ వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వర్క్‌షాప్ ఉదయం 9 నుంచి ప్రారంభవుతుంది.