News February 9, 2026
అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల తయారీ: సీఎం

AP: రాష్ట్రంలో ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు జరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్లతో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ‘అమరావతిలో రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయి. మనమే వాటిని ప్రపంచానికి అందిస్తాం. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు మళ్లుతోంది. మనమూ ఆ దిశగా అడుగులు వేయాలి. అధికారులు నెలవారీగా సమీక్షలు చేసుకోవాలి’ అని సూచించారు.
Similar News
News February 20, 2026
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్!

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై గ్రూప్‌లో కొత్తగా చేరిన వారు అంతకుముందు జరిగిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చు. అడ్మిన్లు లేదా సభ్యులు గత 25 నుంచి 100 మెసేజ్‌లను వారికి షేర్ చేయవచ్చు. ఇది పూర్తి సురక్షితమైన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పనిచేస్తుంది. హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్‌లోని అందరికీ ఇది తెలుస్తుంది. అడ్మిన్లు ఈ ఫీచర్‌ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.
News February 20, 2026
ఇది వరి లాంటి కలుపు మొక్క

వరి చేనులో ‘బొంత ఊద’ కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.
News February 20, 2026
బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.


